శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Police Negligence in America : అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యంతో కర్నూలు యువతి మృతి… కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

    15 hours ago

    సియాటెల్, ఫిబ్రవరి 12: అమెరికాలో పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు జిల్లాకు చెందిన యువతి జాహ్నవి (23) కుటుంబానికి సియాటెల్ నగర యంత్రాంగం భారీ పరిహారం ప్రకటించింది. సుమారు 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని ఒక రహదారి దాటుతున్న సమయంలో అత్యవసర కాల్‌కు స్పందిస్తూ వేగంగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జాహ్నవి అక్కడి యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోంది.

    ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన బాడీక్యామ్ వీడియో దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. మరో పోలీస్ అధికారి చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో వెల్లడించారు. జాహ్నవి కుటుంబం 2024లో సియాటెల్ నగర పాలక సంస్థపై ‘తప్పిద మరణం’ (Wrongful Death) కేసు దాఖలు చేసింది. దాదాపు మూడేళ్ల న్యాయపోరాటం అనంతరం పరిహారంపై ఒప్పందం కుదిరింది. ఈ పరిహారంలో ఎక్కువ భాగం నగర ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించబడనున్నట్లు సమాచారం. ఈ ఘటన అమెరికాలో పోలీస్ బాధ్యత, అత్యవసర సేవల నిర్వహణ, విదేశీ విద్యార్థుల భద్రత వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీసింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Scenic rail travel in Kashmir gets boost as Vistadome coach added to Budgam–Katra special; service extended to Katra
    తర్వాత ఆర్టికల్
    IND vs NAM, T20 WC: Eyes on Abhishek Sharma as India face Namibian challenge in Delhi

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి