శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Pedicure : ఇంట్లోనే పెడిక్యూర్: పాదాలకు సహజమైన కాంతి, కోమలత్వం

    13 hours ago

    ఆడవారికి అందం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ. ముఖం, జుట్టు మాత్రమే కాదు… పాదాలు కూడా అంతే ముఖ్యమైనవి. రోజంతా మన బరువంతా మోయే పాదాలను సరైన విధంగా చూసుకోకపోతే రంగు మారడం, ట్యాన్, పగుళ్లు, డెడ్ స్కిన్ వంటి సమస్యలు వస్తాయి. బయట పెడిక్యూర్ చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇంట్లోనే సులభంగా పెడిక్యూర్ చేసుకోవచ్చు.

     ఎలా చేసుకోవాలి?

    1. పాదాలు నానబెట్టడం:

    ఓ టబ్‌లో గోరువెచ్చని నీరు పోయాలి.

    అందులో ఆరెంజ్ పీల్స్, కొద్దిగా వైట్ వెనిగర్, రోజ్ పెటల్స్, ఉప్పు వేసుకోవాలి.

    పెడిక్యూర్ లోషన్ లేకపోతే షాంపూ వేసినా సరే.

    పాదాలను 10–20 నిమిషాలు నానబెట్టాలి.

    ఇలా చేయడం వల్ల హార్డ్ స్కిన్ మెత్తబడుతుంది, దుమ్ము దూరుతుంది.

    2. ఎక్స్‌ఫోలియేషన్:

    ఎక్స్‌ఫోలియేట్ బ్రష్ లేదా పెడిక్యూర్ స్టోన్‌తో పాదాలను మెల్లగా రబ్ చేయాలి.

    డెడ్ స్కిన్ తొలగి పాదాలు మృదువుగా మారతాయి.

    పగుళ్లు ఉన్న చోట కాస్త జాగ్రత్తగా రబ్ చేయాలి.

    3. నేచురల్ మాస్క్:

    నానబెట్టిన బియ్యం, బీట్‌రూట్ ముక్కలు కలిపి పేస్ట్ చేసుకోవచ్చు.

    లేక మార్కెట్లో దొరికే ఫుట్ మాస్క్ వాడవచ్చు.

    10–15 నిమిషాలు అప్లై చేసి తర్వాత కడగాలి.

    ట్యాన్, మరకలు తగ్గుతాయి.

    4. మాయిశ్చరైజింగ్:

    సీరమ్ లేదా మాయిశ్చరైజర్ రాయాలి.

    పెట్రోలియం జెల్లీ లేదా అలోవెరా జెల్ రాస్తే పాదాలు మరింత కోమలంగా మారతాయి.

    పగుళ్లు ఉంటే ప్రత్యేక జెల్ వాడాలి.

     ఫలితం?

    అప్పుడప్పుడూ ఇలా పాదాలను పాంపర్ చేస్తే అవి రిలాక్స్ అవ్వడమే కాకుండా, శుభ్రంగా, తెల్లగా, అందంగా కనిపిస్తాయి. కొద్దిగా శ్రద్ధ పెట్టండి… మీ పాదాలు కూడా మీ అందానికి మిన్నగా మెరిసిపోతాయి!

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Best Tom Cruise movies to watch on OTT
    తర్వాత ఆర్టికల్
    T20 World Cup: Zimbabwe stun Australia by 23 runs in Colombo

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి