శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    pak ex player comments on team india మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ వ్యాఖ్యలు

    16 hours ago

    టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ పాక్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ స్టేజిలో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 2007లో మొదలైన తొలి టీ20 ప్రపంచ కప్ నుంచి ఇప్పటివరకు పాక్‌తో జరిగిన పోటీలలో 8-1 ఆధిక్యంలో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తం 17 మ్యాచ్‌లలో భారత్ 14 విజయాలు సాధించి పాక్‌పై ప్రాబల్యం చూపించింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “1990ల్లో భారత్‌పై ఓడిపోతామనే భయం ఉండేది, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. టీమిండియా మమ్మల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మా వికెట్ పడినా పెద్ద సంబరాలు చేసుకోవడం లేదు, గెలిచినా అది రొటీన్ విషయంలా కనిపిస్తుంది,” అని ఆమిర్ పేర్కొన్నారు.

     

    మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. భారత్ 7 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లో భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను వరుసగా ఔట్చేసి విజయం సాధించారు. తొలి ఓవర్‌లోనే హార్దిక్ పాండ్య వికెట్ తీసిన సంగతి, బుమ్రా వరుస రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పినాడు. పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో టీ20ల్లో పాక్‌పై భారత్ సాధించిన పరుగుల తేడా పరంగా అతి పెద్ద గెలుపు నమోదు అయ్యింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Grateful and proud': Trott bids farewell after memorable Afghanistan journey
    తర్వాత ఆర్టికల్
    Shahid Kapoor teases 'soon' for ‘Cocktail 2’

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి