శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ntr bharosa pension : ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

    6 రోజులు క్రితం

    వీరులపాడు, జనవరి 31 (తొలి ఉదయం):
    కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో కూటమి నాయకులతో కలిసి ఆమె లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లను నేరుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులతో సన్నిహితంగా మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు పేదల జీవితాల్లో తీసుకొస్తున్న మార్పును వారు ఎమ్మెల్యేకు వివరించారు.

     

    ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్లు పేదల జీవితాలకు ఆధారం. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం” అని తెలిపారు.  అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Not my day, but I gave everything': Sinner reacts after Djokovic ends Australian Open run
    తర్వాత ఆర్టికల్
    Elon Musk’s confession: "I cannot be happy without love"— And why it's imp

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి