శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    NTR 30th Death Anniversary : పేదల సంక్షేమ పథకాల అమలుకు ఆద్యుడు ఎన్టీఆర్: కోగంటి బాబు కంచికచర్లలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

    2 వారాలు క్రితం

    కంచికచర్ల, జనవరి 18 (తొలి ఉదయం):
    పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలుకు ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో ప్రధాన రహదారి వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు, డాక్టర్ పుల్లగూర ప్రభాకర్ రావు, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు నన్నపనేని నరసింహారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం ద్వారా పేదలకు సంక్షేమ పథకాల అమలుకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కోసం పింఛన్ పథకాల అమలుకు కూడా ఎన్టీఆర్ బీజం వేశారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయని అన్నారు.

    బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ కృషి చేశారని, అటువంటి మహోన్నత నేత అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ‘Agatha Christie's Seven Dials’: More mystery thrillers based on books
    తర్వాత ఆర్టికల్
    DYK Sonakshi Sinha always wanted to play a negative role

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి