శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    National electricianday : నేషనల్ ఎలక్ట్రిషియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ – జెండా ఆవిష్కరించిన కోగంటి వెంకట సత్యనారాయణ

    1 week ago

    కంచికచర్ల, జనవరి (తొలి ఉదయం)

    కంచికచర్ల, వీరులపాడు మండలాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎలక్ట్రిషియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు పంచమర్తి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

     

    ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఏఎంసి చైర్మన్ల సంఘం ఉపాధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు) హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఎలక్ట్రిషన్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అన్ని ఎలక్ట్రిషన్లకు నేషనల్ ఎలక్ట్రిషియన్ డే శుభాకాంక్షలు తెలిపారు.

     

    అనంతరం యూనియన్ అధ్యక్షులు పంచమర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల కష్టాలు, సుఖాలు తనకు బాగా తెలుసని, వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

     

    ఈ కార్యక్రమంలో కంచికచర్ల–వీరులపాడు ప్రైవేట్ యూనియన్ అధ్యక్షుడు పంచమర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, కమిటీ సభ్యులు, ప్రైవేట్ ఎలక్ట్రిషన్లు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

     

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Stock market today: Nifty50 ends above 25,150; BSE Sensex ends over 300 points up
    తర్వాత ఆర్టికల్
    O'Romeo: Disha and Shahid's new song Aashiqon Ki Colony out

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి