శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Nara Lokesh birthday celebrations : మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

    2 వారాలు క్రితం

    కాకినాడ | తొలి ఉదయం

    రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వాకలపూడి మహాలక్ష్మి నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు, పిల్లి అనంతలక్ష్మి దంపతుల స్వగృహంలో శుక్రవారం ఉదయం ఈ వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి.

     

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు, నారా లోకేష్ గారి నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని అన్నారు. ముఖ్యంగా విద్య, ఐటీ రంగాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు యువతకు మంచి భవిష్యత్తును అందిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

     

    పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న నారా లోకేష్ గారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని, అందుకు లోకేష్ గారి ప్రోత్సాహం కీలకమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Ajay Devgn drops post for ‘Ranpati Shivray Swari Agra’ trailer
    తర్వాత ఆర్టికల్
    India Budget 2026: Travel and tourism industry seeks demand boost, infrastructure support

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి