శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Nano Fertilizers : రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు ప్రస్తావనతో ఏపీలో నానో ఎరువుల వినియోగానికి పెరిగిన ప్రాధాన్యత

    10 గంటలు క్రితం

    కాకినాడ, తొలి ఉదయం :

    ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత అందుబాటులోకి రావడంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై ఆయన రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నానో ఎరువుల వినియోగం గణనీయంగా పెరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది.

     

    కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో నానో యూరియా 3.24 లక్షల బాటిళ్లు, నానో డీఏపీ 1.57 లక్షల బాటిళ్ల విక్రయాలు జరగగా, 2024–25లో నానో యూరియా 3.01 లక్షలకు, నానో డీఏపీ విక్రయాలు 5.50 లక్షలకు పెరిగాయి. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి నానో యూరియా 6.42 లక్షలు, నానో డీఏపీ 8.19 లక్షల బాటిళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు నానో ఎరువులపై రైతుల విశ్వాసం వేగంగా పెరుగుతోందనడానికి స్పష్టమైన నిదర్శనమని కేంద్రం పేర్కొంది. రైతు సేవా కేంద్రాలు, సహకార సంస్థలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా నానో ఎరువుల పంపిణీ జరుగుతోందని తెలిపింది. రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రదర్శన పొలాలు, రైతు సమావేశాలు, కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు వివరించింది.

     

    రాజ్యసభలో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించిన ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ, నానో ఎరువుల వినియోగం ద్వారా రైతుల ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర రైతులకు ఆధునిక, పర్యావరణహిత ఎరువులు అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని, ఈ దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎంపీ సానా సతీష్ బాబు కృషితో ఆంధ్రప్రదేశ్‌లో నానో ఎరువుల వినియోగానికి మరింత ఊపు వచ్చినట్టుగా రైతు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Producer accuses Biju Menon of skipping promotions
    తర్వాత ఆర్టికల్
    Reducing China dependence: India eyes critical minerals deals with France, Brazil, Canada

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి