శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    More Calcium Than Milk : పాలకంటే ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆహారాలు ఇవే

    3 రోజులు క్రితం

    హెల్త్ డెస్క్:
    కాల్షియం అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది పాలు. పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా—కాల్షియం కోసం తప్పనిసరిగా పాలు తాగాలని చాలా మంది నమ్ముతుంటారు. పాలు తాగకపోతే ఎముకలు బలహీనమవుతాయని, కాల్షియం లోపం వస్తుందని భావిస్తారు. కానీ ఈ విషయం పూర్తిగా అపోహ మాత్రమేనని చెబుతున్నారు వైద్య నిపుణులు.  కాల్షియం పాలు ఒక్కటిలోనే కాదు… పాలకంటే ఎక్కువగా అందించే ఆహారాలు చాలానే ఉన్నాయి. పాలు లేదా నాన్‌వెజ్ తీసుకోలేని వారు కూడా సరైన ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం పూర్తిగా ...

    పాలలో ఎంత కాల్షియం ఉంటుంది?

    ఆవుపాలు (100 మి.లీ) – సుమారు 120 మిల్లీగ్రాముల కాల్షియం

    గేదెపాలు (100 మి.లీ) – సుమారు 210 మిల్లీగ్రాముల కాల్షియం

    అయితే, కొన్ని ఆహారాల్లో పాలకంటే రెట్టింపు, మూడింతల కాల్షియం కూడా ఉంటుందట.

    పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్న సూపర్ ఫుడ్స్ ఇవే!

    ఉలవలు:
    సాధారణంగా రుచికోసం మాత్రమే తీసుకుంటామని అనుకునే ఉలవలు కాల్షియానికి బెస్ట్ సోర్స్.

    100 గ్రాముల ఉలవలు – దాదాపు 290 మిల్లీగ్రాముల కాల్షియం
    పాలు, నాన్‌వెజ్ తీసుకోలేని వారు ఉలవలను రెగ్యులర్‌గా తీసుకుంటే కాల్షియం లోపం ఉండదని చెబుతున్నారు నిపుణులు.

    రాగులు:
    మన ముందుతరం ఎక్కువగా తీసుకున్న రాగులు ఆరోగ్యానికి బంగారం లాంటివి.

    100 గ్రాముల రాగులు – సుమారు 350 మిల్లీగ్రాముల కాల్షియం
    రాగి జావ, ఇడ్లీ, దోశలు, రొట్టెల రూపంలో తీసుకుంటే ఎముకలు మరింత బలపడతాయి.

    తోటకూర:
    ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువగా అందించే వాటిలో తోటకూర ముందువరుసలో ఉంటుంది.

    100 గ్రాముల తోటకూర – సుమారు 400 మిల్లీగ్రాముల కాల్షియం

    మునగాకు:
    కాల్షియం రిచ్ ఫుడ్స్‌లో మునగాకు ది బెస్ట్ అని చెప్పొచ్చు.

    100 గ్రాముల మునగాకు – దాదాపు 440 మిల్లీగ్రాముల కాల్షియం
    మునగాకు పప్పు, కూర, పొడి… ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు.

    కరివేపాకు:
    చాలామంది వంటల్లో వేసి పక్కన పెట్టేసే కరివేపాకులో ఆశ్చర్యకరమైనంత కాల్షియం ఉంటుంది.

    100 గ్రాముల కరివేపాకు – సుమారు 880 మిల్లీగ్రాముల కాల్షియం
    ఇకపై కరివేపాకును తీసి పారేయకుండా, పొడి లేదా పచ్చడిగా చేసుకుని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

    ముఖ్యమైన విషయం

    పాలు తాగకపోయినా కాల్షియం అందదన్న భయం అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. సరైన ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి, కాల్షియం ట్యాబ్లెట్స్ అవసరం కూడా తగ్గుతుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    SS Rajamouli eyes anime sequel to ‘RRR’
    తర్వాత ఆర్టికల్
    T20 WC: Pakistan lose Saim Ayub after solid start vs Netherlands

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి