శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MLA TANGIRALA SOWMYA : దివ్యాంగ చిన్నారులకు అండగా కూటమి ప్రభుత్వం

    6 days ago

    • భవిత కేంద్రాల ద్వారా సమాన విద్యా అవకాశాలు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

    వీర్లపాడు, జనవరి 31 (తొలి ఉదయం):
    ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ చిన్నారులకు కూడా సాధారణ విద్యార్థులతో సమానంగా నాణ్యమైన విద్యా సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్మించనున్న భవిత కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో భవిత కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు.

    దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు అందించే పింఛన్‌ను రెట్టింపు చేసి భరోసా కల్పించిందని ఆమె పేర్కొన్నారు. విద్యతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ప్రత్యేక శిక్షణ, మౌలిక వసతులు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. దివ్యాంగ చిన్నారులు విద్యలో వెనుకబడకుండా, సమాజంలో సమాన అవకాశాలు పొందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Mike Farrell returns to TV with '9-1-1' guest role
    తర్వాత ఆర్టికల్
    Union Budget 2026 income tax: Why focus should shift from tax rates to real ease of compliance

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి