శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MLA tangirala Sowmya : పారిశుద్ధ్యమే ప్రజారోగ్యానికి పునాది : ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

    1 వారం క్రితం

    నందిగామ, జనవరి 24 (తొలి ఉదయం):

    పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ఆదర్శంగా నిలిచే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. శనివారం నందిగామ పట్టణంలోని బాబు జగజీవన్‌రామ్ భవనం ఆవరణలో ఉన్న ప్రధాన కాలువలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి యాప్రాన్, గ్లోవ్స్ ధరించి స్వయంగా వ్యర్థాలను తొలగించారు.

     

    ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సాధారణ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసి, శుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

    పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత. శుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి మూలాధారం” అని పేర్కొన్నారు.

     

    అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్లకార్డులు పట్టుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచుదామని ప్రతిజ్ఞ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారి కృషిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు.

     

    ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందనను పొందిందని, పారిశుద్ధ్యంపై అవగాహన పెంచే దిశగా ఇది కీలకంగా నిలిచిందని స్థానికులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్, పారిశుద్ధ్య సిబ్బంది, కూటమి నేతలు, స్థానిక ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Housing market cools after boom year as sales fall 12% in 2025, prices remain resilient: PropTiger report
    తర్వాత ఆర్టికల్
    RGV on Rahman's communal comment: 'Industry is all about money'

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి