శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mla Muthumula Ashok Reddy : గిద్దలూరుకు త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ. కోటి నిధులు మంత్రి నారాయణను కోరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

    1 week ago

    విజయవాడ:
    గిద్దలూరు పట్టణంలో రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణను కోరారు.  శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, ఈ సందర్భంగా గిద్దలూరు మున్సిపాలిటీలోని పలు కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొనే త్రాగునీటి ఇబ్బందులను నివారించేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.

    ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగూరు నారాయణ, ASC గ్రాంట్ ద్వారా తక్షణ సహాయంగా రూ. కోటి రూపాయలను మంజూరు చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  అలాగే, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు కూడా మంజూరు చేస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  గిద్దలూరు ప్రజల తరఫున మంత్రి నారాయణకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Mrunal Thakur and Dulquer Salmaan reunite for ‘Bheegi Bheegi’
    తర్వాత ఆర్టికల్
    Pro10 Malaysia tournament to be rescheduled; new dates after T20 World Cup

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి