శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MLA Mandali Buddha Prasad : సమాజ చైతన్యానికి విశ్రాంత ఉద్యోగులు ముందుండాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

    3 hours ago

    అవనిగడ్డలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘానికి నూతన భవనం ప్రారంభమైంది. ఆదివారం రెవెన్యూ హాలు ఎదురుగా నిర్మించిన లైబ్రరీ కం రీడింగ్ హాల్‌ను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు తమ అనుభవ సంపదతో సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ భవనం వారి ఆలోచనలు, సూచనలు పంచుకునే వేదికగా నిలవాలని, చర్చా గోష్టుల ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి విలువైన మార్గదర్శకాలు అందించాలని ఆకాంక్షించారు. విశ్రాంతి అనంతరం కూడా ఏదో ఒక వ్యాపకం కొనసాగిస్తూ మానసిక ఉల్లాసం పొందాలని ఆయన సూచించారు.

    2016-17 ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అప్పటి ఎంపీ కొనకళ్ల నారాయణరావు మంజూరు చేసిన రూ.5 లక్షలు, సంఘ శాశ్వత అధ్యక్షులు కాశీభట్ల నాగేశ్వరరావు విరాళంగా అందించిన రూ.4 లక్షలు, సభ్యుల విరాళాలు కలిపి మొత్తం రూ.26 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించారు. స్థలం మంజూరు నుంచి నిర్మాణం వరకు సహకరించి, ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ను సంఘ పెద్దలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, సంఘ అధ్యక్షులు భూపతి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బొప్పన కాశీ విశ్వేశ్వరరావు, ట్రెజరర్ బడే దానారావు తదితరులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Is Akshay Kumar joining 'Golmaal 5'? Arshad Warsi drops a massive hint
    తర్వాత ఆర్టికల్
    Groundhogging: Why you're dating the same person in different bodies

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి