శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ministry of Home Affairs : గిద్దలూరుకు గర్వకారణం – అవార్డు శ్రీరామ్‌కు కేంద్ర ‘అవుట్‌స్టాండింగ్ ఇన్ ఇంటెలిజెన్స్’

    4 hours ago

    గిద్దలూరు, మార్చి 2: పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక ‘అవుట్‌స్టాండింగ్ ఇన్ ఇంటెలిజెన్స్–2025’ పురస్కారం ప్రకాశం జిల్లా వాసి వేలమూరి శ్రీరామ్‌కు లభించింది. ఈ అవార్డును Ministry of Home Affairs ప్రదానం చేస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐఓ, జోనల్ ఇన్స్పెక్టర్‌గా సేవలందిస్తున్న శ్రీరామ్, సోమశిలకు చెందిన కృష్ణమూర్తి–వరలక్ష్మి దంపతుల కుమారుడు. కృష్ణమూర్తి కూడా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా సేవలందించడం విశేషం.

    కలువాయి, సోమశిల, నెల్లూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీరామ్ తన సేవా ప్రస్థానాన్ని కానిస్టేబుల్‌గా ప్రారంభించారు. గ్రేహౌండ్స్ దళంలో ప్రతిభ చాటుకుని సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లాలోని దోర్నాల, గిద్దలూరు, మార్టూరు, కందుకూరు, చీరాల రూరల్, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. తదుపరి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన పొదిలి, దర్శి, కందుకూరు ప్రాంతాలతో పాటు విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులను ఛేదించి తన ప్రతిభను నిరూపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాధించిన ఈ గౌరవం గిద్దలూరు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Aneet Padda’s ivory saree look stands out amid dramatic red carpet fashion
    తర్వాత ఆర్టికల్
    VIROSH wedding reception: Guest list tightened further

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి