శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mega star Chiranjeevi updates : డాక్టర్ నితిన్‌కు కృతజ్ఞతలు… సర్జరీ వివరాలు వెల్లడించిన చిరు

    15 hours ago

    మెగాస్టార్ చిరంజీవి భుజానికి సర్జరీ జరిగిందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల అల్లు శిరీష్ తన వివాహ వేడుక సందర్భంగా తొలి వెడ్డింగ్ కార్డును చిరంజీవికి అందజేసిన వేళ, ఆయన చేతికి కట్టు ఉండటం అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. దీంతో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది.

    ఈ నేపథ్యంలో చిరంజీవి స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. తన భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నానని తెలిపారు. ‘‘చేతికి పట్టీ ఉండటం గమనించి చాలా మంది శ్రేయోభిలాషులు ఆరా తీశారు. నా భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడుతోంది. నా దినచర్య సజావుగా కొనసాగుతోంది. అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నైపుణ్యంతో ఈ ప్రక్రియ సౌకర్యవంతంగా పూర్తైంది. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. చిరంజీవి ఆరోగ్యంపై స్పష్టత రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన త్వరలోనే తన సాధారణ కార్యకలాపాలకు పూర్తిగా తిరిగి రానున్నట్లు సమాచారం. 

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Who is Ishan Kishan's girlfriend Aditi Hundia? His grandfather confirms their relationship
    తర్వాత ఆర్టికల్
    T20 WC Live: New Zealand in early trouble, lose two wickets in 174-run chase

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి