శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    MEGA BLOCKBUSTER RESPONSE : మెగా బ్లాక్‌బస్టర్‌కు ఘనంగా సంబరాలు - మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ‘MSG’ టీమ్

    3 వారాలు క్రితం

    సంక్రాంతి 2026 కానుకగా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు (MSG)’ సినిమా ప్రీమియర్ల నుంచే మెగా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా సినిమా ఘన విజయం పట్ల ఆనందాన్ని పంచుకునేందుకు దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుష్కోణి దేల కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

    ప్రీమియర్లకు వచ్చిన అద్భుత స్పందనపై చిరంజీవి గారు చిత్రబృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదాత్మక కథనం, పండుగ వాతావరణానికి తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘MSG’ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది.

    ‘మన శంకర వర ప్రసాద్ గారు (MSG)’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతి 2026లో కుటుంబంతో కలిసి చూసే బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదే అంటూ అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Celebrities showcase standout fashion at Golden Globes
    తర్వాత ఆర్టికల్
    Vijay Hazare Trophy QFs: No Sarfaraz for Mumbai; Karnataka opt to bowl

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి