శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mangalagiri TDP office: మంగళగిరిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించరు

    1 వారం క్రితం

    మంగళగిరి:

    తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ వర్క్‌షాప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు టీడీపీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. వర్క్‌షాప్‌లో ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు  పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి మరియు కేబీసీసీ బ్యాంక్ చైర్మన్   నెట్టెమ్ట్ రఘురామ్ ఇతర ప్రధాన నాయకులు, రాష్ట్ర పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రఘురామ్ గారు పార్లమెంట్ కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించి, పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ సజీవ వారసత్వం, మహానేత  నందమూరి తారక రామారావు పరిపాలనా సిద్ధాంతాలు, ప్రజాకేంద్రిత రాజకీయాల పై మార్గదర్శకత వివరించారు.

     

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరియు ప్రత్యేక ట్రైనింగ్ రూములను పరిశీలించి, సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పార్టీ లక్ష్యాలు గ్రామ స్థాయినుంచి ప్రజల్లోకి బలంగా చేరేలా కృషి చేయాలని, శాశ్వత అధికార సాధన కోసం ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని సూచించారు. వర్క్‌షాప్ తర్వాత నాయకులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, పార్లమెంట్ కమిటీ సభ్యులకు రాజకీయ పరిణామాలు, పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై శిక్షణ విధానం సమీక్షించారు. ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి, సిద్ధాంత స్పష్టతకు, నాయకత్వ నైపుణ్యాల పెంపుకు కీలకంగా నిలిచిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    WPL: Gujarat Giants open their innings vs Delhi Capitals
    తర్వాత ఆర్టికల్
    10 most beautiful countries in the world; India on the list

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి