శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mangalagiri : ఎన్టీఆర్ 30వ వర్ధంతి: గుంటూరు జిల్లాలో తెలుగుయువత రక్తదానంతో ఘన నివాళులు

    2 weeks ago

    గుంటూరు/మంగళగిరి:
    చరిత్ర మరువని యుగపురుషుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి 30వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారి నేతృత్వంలో గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తెలుగుయువత నాయకులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

     

    అదే విధంగా, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గుంటూరు పార్లమెంట్ పరిధి నుంచి జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుయువత సభ్యులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ద్రవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ, “ఎన్టీఆర్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన పట్టుదల, కృషి, ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగితే అసాధ్యాలను కూడా సాధ్యాలుగా మార్చవచ్చు” అని పేర్కొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఎన్టీఆర్ చేసిన పిలుపును స్మరిస్తూ, ప్రతి ఏటా తెలుగుయువత రక్తదానం ద్వారా నివాళులు అర్పించడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి యువత అంకితభావంతో కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Roger Allers dies at 76; tributes highlight animation legacy
    తర్వాత ఆర్టికల్
    Stock market today: Nifty50 drops below 25,550; BSE Sensex down 600 points as Trump tariff fears spook global markets

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి