శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mahatma Gandhi death anniversary : ప్రపంచానికే దిక్సూచి మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో జనసేన నేత సామినేని ఉదయభాను

    1 వారం క్రితం

    జగ్గయ్యపేట:
    మహాత్మాగాంధీ చూపిన మార్గం కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ దిక్సూచిగా నిలుస్తుందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఘన నివాళులు అర్పించారు.

     

    ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ, నేటి ప్రపంచం యుద్ధాలు, హింసతో అల్లాడుతున్న తరుణంలో గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు మరింత అవసరమయ్యాయని పేర్కొన్నారు. గాంధీజీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక మహోన్నత ఆశయమని స్పష్టం చేశారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు. “నా జీవితమే నా సందేశం” అంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిగర్వి గాంధీజీ అని అన్నారు. మహాత్మాగాంధీ భౌతికంగా మనకు దూరమైనా, ఆయన ఆలోచనలు యుగయుగాల పాటు మార్గదర్శకంగా నిలుస్తాయని ఉదయభాను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొని గాంధీజీ సేవలను స్మరించుకున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ICC U19 World Cup Live Score: England vs New Zealand
    తర్వాత ఆర్టికల్
    SRK starrer King to feature massive Rs 50 cr action sequence

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి