శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    KTR fires at CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు

    1 రోజు క్రితం

    జయశంకర్ భూపాలపల్లి, (సోమవారం):
    సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో మాట్లాడిన కేటీఆర్, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. అనుచిత వ్యాఖ్యలు చేసే సీఎం రేవంత్‌రెడ్డికి పోలింగ్ కేంద్రంలోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ వచ్చినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని, కేసీఆర్ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని అన్నారు. మద్యం, డబ్బులు పంచి ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తూ, మరోసారి మోసపోయి కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని సూచించారు. అలాగే బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.

    అదే సమయంలో కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ కార్నర్ మీటింగ్ సందర్భంగా సామాజిక కార్యకర్త, దివంగత రాజలింగమూర్తి ఫ్లెక్సీని తొలగించడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని కావాలనే బీఆర్ఎస్ నేతలు తొలగించారంటూ రాజలింగమూర్తి కుమార్తె ఆరోపించగా, రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్యకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిబాబు కారణమని ఆమె ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Bad Bunny DELETES social media posts after historic Super Bowl LX halftime show
    తర్వాత ఆర్టికల్
    T20 WC 2026: De Kock, Markram provide steady start for South Africa

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి