శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kharge, Rahul Express Satisfaction Over Telangana Congress Performance : తెలంగాణలో కాంగ్రెస్ పనితీరుపై ఖర్గే, రాహుల్ సంతృప్తి – రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

    8 hours ago

    Mallikarjun Kharge, Rahul Gandhi తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్న ఏఐసీసీ నేతలు, ప్రజల అభిప్రాయాన్ని క్షేత్రస్థాయిలో సేకరించాలని సూచించారు. వరి ధాన్యం సాగు, కొనుగోలు అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆయిల్ ఫాం పంటను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి Tummala Nageswara Rao వివరించారు. రైతు సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఖర్గే, రాహుల్ స్పష్టం చేశారు.

     

    ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని ఏఐసీసీ నేతలు ప్రశంసించారు. గ్రేటర్ ఎన్నికల్ని ముందుగా నిర్వహించాలా లేదా ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలను ముందుగా చేపట్టాలా అన్న అంశంపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. శాఖల వారీగా మంత్రుల పనితీరును రాహుల్ గాంధీ సమీక్షించగా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే పటిష్టమైన కేడర్ అవసరమని ఖర్గే పేర్కొన్నారు. నేతలు సమష్టిగా పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని రాహుల్ గాంధీ కితాబిచ్చారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'KHxRK': Rajinikanth and Kamal Haasan reunite after 40 years
    తర్వాత ఆర్టికల్
    US trade gap widens as goods deficit hits record $1.24 trillion in 2025

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి