శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kavitha’s Sensational Remarks on BRS and BJP : కవిత కొత్త పార్టీ ఖాయం.. సిద్ధిపేట నుంచి పోటీకి సంకేతాలు, బీఆర్ఎస్–బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

    15 గంటలు క్రితం

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ఖాయమని ప్రకటించారు. మే నెలలో పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించిన కవిత, ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఉండవంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. సామాజిక తెలంగాణే తన లక్ష్యమని స్పష్టం చేసిన కవిత, ప్రజలు సూచించిన పేరునే కొత్త పార్టీకి పెడతామని తెలిపారు.

     

    వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని ప్రకటించిన కవిత, తొలి ప్రాధాన్యతగా సిద్ధిపేట, రెండో ప్రాధాన్యతగా బోధన్ను పేర్కొన్నారు. సిద్ధిపేట ఎవరి జాగీరు కాదని వ్యాఖ్యానించిన కవిత, అక్కడ యాంటీ ఇంకంబెన్సీ స్పష్టంగా ఉందని సంకేతాలు ఇచ్చారు. తన తాజా రాజకీయ కార్యాచరణ బీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్త పార్టీ ప్రకటన అనంతరం తన భవిష్యత్ రాజకీయ లక్ష్యాలు, కార్యాచరణపై పూర్తి స్పష్టత ఇస్తానని కవిత వెల్లడించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'India used to fear us': Pakistan's Amir, Ali blast Shadab for digs at seniors
    తర్వాత ఆర్టికల్
    Emotional intelligence is trending, but emotional availability isn’t: Who’s actually there for you?

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి