శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Karrapati’s Services Are Exemplary : కర్లపాటి సేవలు ఆదర్శప్రాయం – తన్నీరు నాగేశ్వరరావు

    10 hours ago

    జగ్గయ్యపేట, తొలి ఉదయం :

    గత రెండున్నర దశాబ్దాలుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న కర్రపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వెంకట శ్రీనివాసరావు సేవలు ఆదర్శప్రాయమని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు.  ఇటీవల ట్రస్ట్‌కు లభించిన రెండు ప్రతిష్టాత్మక గుర్తింపుల సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని కర్రపాటి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వెంకట శ్రీనివాసరావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

     

    ట్రస్ట్ నాణ్యత నిర్వహణ వ్యవస్థకు ఐఎస్ఓ గుర్తింపు పొందడంతో పాటు, అంబుడ్స్ పర్సన్‌గా ఎంజి నరేగా పరిధిలో విశిష్ట సేవలు అందించినందుకు జనవరి 26న జరిగిన 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ కే. బాలాజీ చేతుల మీదుగా జిల్లా స్థాయి మెరిటోరియస్ అవార్డు అందుకోవడం అభినందనీయమని తన్నీరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, సామాజిక సేవారంగంలో శ్రీనివాసరావు చేస్తున్న కృషి అనేక మందికి ప్రేరణగా నిలుస్తోందని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.

     

    అనంతరం కర్లపాటి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ గుర్తింపును వ్యక్తిగత గౌరవంగా కాకుండా సమాజ సేవకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తనను అభినందించిన తన్నీరు నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్‌కు లభించిన ఐఎస్ఓ సర్టిఫికేషన్ తమ బాధ్యతను మరింత పెంచిందని, నాణ్యత, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనంతో ముందుకు సాగేందుకు ఇది స్పష్టమైన దిశను చూపించిందన్నారు. అలాగే అంబుడ్స్ పర్సన్‌గా లభించిన అవార్డు తనకే కాకుండా గ్రామీణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలతో కలిసి ప్రజల కోసం పని చేయడమే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు.   ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, అనుమంచిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బెడదం సత్యనారాయణ, ట్రస్ట్ ప్రతినిధులు కర్లపాటి రాజారావు, రాయపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని కర్లపాటిని అభినందించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Big Update: Govt Changes PAN Rules For Select High-Value Transactions-All You Need To Know
    తర్వాత ఆర్టికల్
    T20 WC 2026: Can USA beat Pakistan again in the T20 World Cup?

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి