శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    KAKINADA : వైకుంఠాన్ని తలపించిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు...

    1 వారం క్రితం

    కాకినాడ,( తొలి ఉదయం) 

    కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు భక్తులపై మరింతగా కురుస్తున్నాయనడానికి నిదర్శనంగా జగన్నాధపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తి, శ్రద్ధ, సంప్రదాయం మేళవించిన ఈ బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన స్వామి వారి 60వ వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తుల జీవితాల్లో ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది. ప్రధాన అర్చకులు పొందూరి సీతారామానుజాచార్యులు, పొందూరి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఆగమశాస్త్రోక్త విధానంలో, వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామి  అమ్మవార్ల కళ్యాణం వైకుంఠాన్ని తలపించేలా సాగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు గోవిందా గోవిందా నామస్మరణతో ఆలయాన్ని నాదమయం చేశారు.

    స్వామి వారి షష్టిపూర్తి కళ్యాణంగా భావించే ఈ 60వ వార్షిక కళ్యాణ మహోత్సవం దైవానుగ్రహానికి ప్రతీకగా, కుటుంబ శాంతి, ఐశ్వర్యం, సంతాన భాగ్యం కోసం భక్తులు విశేషంగా ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం మహాపుణ్యంగా భావిస్తారు.

    ఈ పవిత్ర ఘట్టానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై స్వామివారిని దర్శించుకోవడంతో కార్యక్రమానికి మరింత ఘనత చేకూరింది. బ్రహ్మోత్సవాల ఔన్నత్యాన్ని నిలబెట్టిన సేవాభావం మల్లాడి ఏడుకొండలు ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించడంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలు చెక్కుచెదరకుండా, ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు చేయడంలో ఆయన చూపుతున్న నిబద్ధత భక్తుల ప్రశంసలు పొందుతోంది. ధార్మిక సేవే లక్ష్యంగా, నిస్వార్థంగా ఉత్సవాల నిర్వహణను ముందుండి నడిపిస్తూ ఆలయ ఔన్నత్యాన్ని మరింతగా పెంచుతున్నారు.

    ఈ సందర్భంగా ఆలయ గ్రేడ్–1 కార్యనిర్వాహణాధికారి ఎస్. సత్యవాణి మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 31వ తేదీన స్వామి వారి రథోత్సవం, ఫిబ్రవరి 3న తెప్పోత్సవం, ఫిబ్రవరి 8న భారీ అన్నదాన కార్యక్రమం భక్తుల కోసం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మల్లాడి విమల, చొక్కా లత, పాబోలు పద్మజ, తుమ్మల సత్తిబాబు, నందమూరి సీతాలక్ష్మి, ఉప్పిడి గోపాలకృష్ణ, బండి సత్యవేణి, జానకి హోతా, ఓలేటి రాము, సంగాని సత్యం, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చౌదరి తదితరులు పాల్గొని బ్రహ్మోత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. భక్తి, ధార్మికత, సేవాభావం సమ్మేళనంగా సాగుతున్న జగన్నాధపురం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు…  దర్శన మాత్రేణ ముక్తి అనే విశ్వాసాన్ని భక్తుల హృదయాల్లో మరింత బలపరుస్తున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Dhurandhar' was edited for OTT without Aditya Dhar's consent: Report
    తర్వాత ఆర్టికల్
    ZKP’s $5M Giveaway Makes It the Best Crypto to Buy in the Current Market While ETH Faces Liquidity Test & Ondo Stalls

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి