శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kakinada : గుండె జబ్బులపై అవగాహన అత్యవసరం: డా. దుర్గా పవన్

    1 వారం క్రితం

    • నియమిత వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలితోనే గుండె రక్షణ

    కాకినాడ (తొలి ఉదయం):
    గుండె జబ్బుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరమని ట్రస్ట్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా. బి. దుర్గా పవన్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుతం గుండె వ్యాధులు వస్తున్నాయని, అందువల్ల చిన్న వయసు నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యమని సూచించారు.

    సోషల్ మీడియాలో గుండె జబ్బులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని డా. దుర్గా పవన్ హెచ్చరించారు. రోజువారీ నడక, సైక్లింగ్ వంటి వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. అలాగే బీపీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా పరీక్షించుకోవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచడం, సరైన నిద్రకు క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం డా. దుర్గా పవన్‌ను రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    WPL: UP Warriorz look to rebuild innings vs RCB
    తర్వాత ఆర్టికల్
    Can Border 2 beat Dhurandhar’s record-breaking run? | Excl

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి