శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kakinada : క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదికలు టోర్నమెంట్లే: ఎఐసిసి జిల్లా అధ్యక్షులు రిక్కీ గూటం

    1 వారం క్రితం

    కాకినాడ (తొలి ఉదయం):

    క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో క్రీడా టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఎఐసిసి) జిల్లా అధ్యక్షులు రిక్కీ గూటం అన్నారు.

     

    కాకినాడ నగరంలోని ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా స్థాయి ఎఐసిసి బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అండర్-17 బాలురు, బాలికలు, అలాగే పురుషులు, మహిళల విభాగాల్లో జరిగిన ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా నిలిచింది.

     

    ఈ సందర్భంగా రిక్కీ గూటం మాట్లాడుతూ, క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ యువతలోని ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించి యువతను ప్రోత్సహిస్తామని ఆయన వెల్లడించారు.

     

    పోటీల ముగింపు కార్యక్రమానికి ఎఐసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసప్ బెన్ని, జిల్లా ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్, కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ బెన్ని, సౌమ్య, సోని, ఉత్తేజ్, ఏనోష్, జోయల్ రాజు, రవి కౌర్ హాజరై క్రీడాకారులను అభినందించారు.

     

    ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్ మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఎఐసిసి సభ్యులు ప్రవీణ్ బెన్ని మరియు వారి బృందం, ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ రంగబాబు, కోచ్‌లు మూర్తి, శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు.

     

    పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జోసప్ బెన్ని, స్టీఫెన్ ఆనంద్‌తో పాటు ఎఐసిసి కార్యవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'He deserves another chance': Ex-India captain's strong message to Agarkar over Sarfaraz
    తర్వాత ఆర్టికల్
    Budget 2026 banking expectations: Pension changes, insurance reforms, tax relief & more

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి