శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Janasena leader samineni UdayaBhanu : కూటమి ధర్మం పాటిస్తూ జనసేన శ్రేణులు ప్రజల్లోకి బలంగా వెళ్లాలి — ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

    2 వారాలు క్రితం

    జగ్గయ్యపేట | తొలి ఉదయం

    పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విధంగానే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ కమిటీల నిర్మాణం చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ కమిటీల ఏర్పాటు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

     

    ఈ సందర్భంగా విజయవాడ ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. నేతాజీ సేవలను స్మరించుకుంటూ పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు.

     

    కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు నాంచారయ్య నేతృత్వంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పలువురు పేదలకు ఆర్థిక సహాయం అందజేశారు.

     

    అనంతరం మాట్లాడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

     

    సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకొని పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం సాధించాలన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు త్వరలో ఏర్పాటు చేసే కమిటీల్లో తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.

     

    త్వరలోనే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రారంభమవుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

     

    ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మండలి రాజేష్, అమ్మిశెట్టి వాసు, కార్పొరేటర్లు మహాదేవ అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, ఉమ్మడిశెట్టి బహుదూర్, దాసాంజనేయ స్వామి, చైర్మన్ సోడిశెట్టి కృష్ణ ప్రసాద్, సెంట్రల్ పీఓసీ వంశీ కృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India Budget 2026: Travel and tourism industry seeks demand boost, infrastructure support
    తర్వాత ఆర్టికల్
    World Championship in India? UCI considers upgrading Pune Grand Tour's status next year

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి