శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Jaggayapeta : గ్రూప్–1లో విజయం సాధించిన వైష్ణవికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దంపతుల ఘన సత్కారం

    1 month ago

    జగ్గయ్యపేట:

    జగ్గయ్యపేట పట్టణం శాంతినగర్‌కు చెందిన దేచుపాలెం ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ అంగజాల రవీంద్ర బాబు కుమార్తె వైష్ణవి ప్రతిష్టాత్మకమైన గ్రూప్–1 పరీక్షల్లో ప్రతిభ చూపి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ (డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్)గా ఎంపికై జగ్గయ్యపేటకు గర్వకారణంగా నిలిచారు.

     

    ప్రస్తుతం జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలోని ఆలయం ఈవోగా విధులు నిర్వర్తిస్తూ ఈ ఘన విజయం సాధించడం విశేషం.

     

    ఈ సందర్భంగా వైష్ణవి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మరియు శ్రీమతి శ్రీరాం శ్రీదేవి (అమ్మాజీ) దంపతులు వైష్ణవిని శాలువాతో ఘనంగా సత్కరించి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

     

    వైష్ణవి సాధించిన ఈ విజయం జగ్గయ్యపేట ప్రాంత యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

     

    ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గింజుపల్లి రమేష్, బండిపాలెం గ్రామ సొసైటీ చైర్మన్ బొల్నీడి అప్పారావు తదితర ప్రముఖులు పాల్గొని వైష్ణవిని అభినందించారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IND vs PAK: Sooryavanshi, Mhatre, George fall in 4 balls vs Pakistan
    తర్వాత ఆర్టికల్
    FM brings IT services under single category in Union Budget: What this means for IT companies

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి