శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    JaganMohan Reddy : అమెరికాలో 19వ ఆటా మహాసభలకు వైయస్ జగన్‌కు ఆహ్వానం

    1 hour ago

    అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిను ఆహ్వానించారు. ఈ మేరకు ఆటా ప్రతినిధులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షుడు భువనేష్ బుజల, కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి తదితరులు 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

    ఈ సందర్భంగా జగన్‌తో ఆటా ప్రతినిధులు సంస్థ కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్లపై వివరాలు పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ భాషా, సాంస్కృతిక పరిరక్షణకు ఆటా చేస్తున్న కృషిని జగన్ ప్రశంసించారు. తెలుగు సమాజ ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని ఈ మహాసభలు మరింతగా చాటిచెప్పాలని ఆకాంక్షించారు. అమెరికా సహా వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమం ఘనవిజయం సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    LPG sales down 19% year-on-year in May
    తర్వాత ఆర్టికల్
    'Players like Jofra might not play for England if ... ': Stokes reacts to Archer's criticism

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి