శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ITR Refunds : ఐటీఆర్ రీఫండ్స్: జాప్యానికి తెర.. భారీగా జారీ ప్రారంభం

    12 hours ago

    ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) ఫైల్ చేసి నెలలు గడిచినా లక్షలాది ట్యాక్స్ పేయర్లు తమ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 24 లక్షల ఐటీఆర్‌లు ప్రాసెసింగ్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రీఫండ్స్‌ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని, సాంకేతిక కారణాలతో జాప్యం జరిగిందని స్పష్టం చేసింది.

    ఈ ప్రకటన అనంతరం పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో రీఫండ్స్ జారీ అవుతున్నాయని పన్ను నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా హై-వాల్యూ రీఫండ్స్ ఉన్నవారికి వేగంగా డబ్బులు జమ అవుతున్నట్లు సమాచారం. అదనపు వాలిడేషన్ తనిఖీల వల్ల ఆలస్యం అయిన కేసుల్లో ఇప్పుడు క్లియరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    క్లియర్ ట్యాక్స్ సీఈఓ అర్చిత్ గుప్తా ప్రకారం, గత 24 గంటల్లో రీఫండ్ ప్రాసెసింగ్ గణనీయంగా పెరిగింది. గత వారాలతో పోలిస్తే గత రెండు రోజుల్లో రీఫండ్స్ జారీ 3 రెట్లు పెరిగినట్లు తెలిపారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించనుంది.  అందువల్ల ట్యాక్స్ పేయర్లు తమ రీఫండ్ స్టేటస్‌ను అధికారిక పోర్టల్‌లో చెక్ చేసుకోవడం మంచిది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Wuthering Heights India Release: Fennell’s film draws split reviews
    తర్వాత ఆర్టికల్
    From 1983 to 2026: How Zimbabwe have troubled Australia

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి