శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Inauguration of the Srikalahasti Giripradakshina Path : శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభం: ఆలయ పరిరక్షణకు కూటమి కట్టుబాటు

    12 hours ago

    రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ గారు ఆలయ పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును ప్రారంభించారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల సిమెంట్ రహదారిని నిర్మించారు. శివరాత్రి అనంతరం గిరిప్రదక్షణ మార్గం ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

    రూ.40 కోట్లతో రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాలకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురం, కోటప్పకొండ, వాడపల్లి తదితర క్షేత్రాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Lee Seung Gi and Lee Da In to become parents for second time
    తర్వాత ఆర్టికల్
    Why stock market crashed today: Nifty50 ends below 25,500; BSE Sensex down over 1,000 points - top 5 reasons for fall

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి