శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Illegal belt liquor sale rampant in Bantumilli : బంటుమిల్లిలో జోరుగా బెల్ట్ మద్యం… పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

    3 వారాలు క్రితం

    బంటుమిల్లి:
    బంటుమిల్లి మండల కేంద్రంలో బెల్ట్ మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. టౌన్‌లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఓ మద్యం షాపు నుంచే యాదేచ్చగా బెల్ట్ మద్యం రవాణా జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.  కౌంటర్ కంటే ఒక్కో బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తూ, షాప్‌లో పనిచేసే సిబ్బంది మద్యం బయటకు పంపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, పర్మిట్ రూమ్ అనుమతి లేకుండానే షాప్‌లో అనధికార సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడే మద్యం సేవించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

    మద్యం తాగేందుకు నాసిరకం, అనుమతులు లేని వాటర్ ప్యాకెట్లు, సోడాలు విక్రయిస్తుండటంతో పాటు, లైసెన్స్ లేని కర్కానాల్లో తయారైన నాసిరకం నూనె, పిండి తో చేసిన పల్లీలు ఇతర తినుబండారాలు కూడా విక్రయిస్తున్నారని మహిళలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు నామమాత్రపు తనిఖీలు కూడా చేయకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇదే అదునుగా చెలరేగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    బెల్ట్ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, తొలిసారి జరిమానా, రెండోసారి షాప్ సీజ్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కరవవుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కరోజు ఈ మద్యం షాపులోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే, సంచులు, బ్యాగుల్లో ఎన్ని వేల మద్యం బాటిళ్లు బయటకు వెళ్తున్నాయో స్పష్టమవుతుందని వారు అంటున్నారు.

    ఈ అనధికార బెల్ట్ మద్యం విక్రయాలపై బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల ఎక్సైజ్ సీఐ రమణను వివరణ కోరగా, వెంటనే సిబ్బందితో కలిసి సంబంధిత మద్యం షాపుపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార మద్యం అమ్మకాలను ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి అక్రమ మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళలు, స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Kishori escapes unhurt after SUV collides with her car
    తర్వాత ఆర్టికల్
    Controversy! Amid Oly 2036 dreams, Dane blasts India Open conditions

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి