శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ICC Men's T20 World Cup 2026: సూపర్ 8లో భారత్‌కు భారీ షాక్.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    2 గంటలు క్రితం

    సూపర్ 8 దశలో ఆదివారం South Africa national cricket teamతో జరిగిన మ్యాచ్‌లో India national cricket team 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadiumలో సఫారీ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 111 పరుగులకే ఆలౌటైంది. హోం గ్రౌండ్‌లో ఇంతటి పరాభవం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

    ఈ ఓటమిపై భారత క్రికెట్ దిగ్గజం Kapil Dev తీవ్రంగా స్పందించాడు. “హోం గ్రౌండ్‌లో ఇంత భారీ తేడాతో ఓడిపోవడం అవమానకరం. గెలుపు-ఓటములు ఆటలో భాగమే కానీ మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అవ్వడం బాధాకరం. కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు ఇలా చేతులెత్తేయడం సరైంది కాదు. సూపర్ 8 లాంటి దశలో వైస్ కెప్టెన్‌ను పక్కన పెట్టడం అర్థం కావడం లేదు. అక్షర్ పటేల్‌ను తప్పించడం సమర్థించలేం. ఈ నిర్ణయాలు ఎవరు, ఎలా తీసుకుంటున్నారో తెలియడం లేదు. ఇలాంటి ప్రయోగాలు ఇకనైనా ఆపాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

     

    ఈ ఓటమితో భారత్ -3.800 నెట్ రన్‌రేట్‌తో పట్టికలో అట్టడుగుకు చేరింది. సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో West Indies cricket team, Zimbabwe national cricket teamపై భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సూపర్ 8 దశ నుంచే టీమిండియా టోర్నీకి వీడ్కోలు పలకాల్సి వచ్చే ప్రమాదం ఉంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Abhishek Sharma has passed the baton of 'zeroes' to in-form Ishan Kishan'
    తర్వాత ఆర్టికల్
    IDFC First Bank Fraud: RBI Says Banking System Remains Strong, No Stability Threat

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి