శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    How Much Gold and Silver Is Stored in Telangana Temples : తెలంగాణ దేవాలయాల్లో బంగారం-వెండి నిల్వలు ఎన్ని? వేల కోట్ల విలువైన సంపద బయటపడింది

    7 hours ago

    బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, భక్తులు తమ ఇష్టదైవాలకు బంగారం, వెండి రూపంలో కానుకలు సమర్పించడం కొనసాగుతూనే ఉంది. ఉంగరాలు, కిరీటాలు, కంఠాభరణాలు మాత్రమే కాకుండా బంగారు బిస్కెట్లు, నాణేలు, కుటుంబ వారసత్వ ఆభరణాలనూ హుండీల్లో వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన దేవాలయాల వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

    దేవాదాయశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో కలిపి సుమారు 550 కిలోల బంగారం, 29,582 కిలోల వెండి నిల్వగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో బంగారం ధర దాదాపు రూ.1.50 కోట్లు ఉండగా, 550 కిలోల బంగారం విలువ రూ.800 కోట్లకు పైగానే ఉంటుంది. అదే విధంగా వెండి నిల్వల విలువ సుమారు రూ.843 కోట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ దేవాలయాల బంగారం-వెండి సంపద విలువ దాదాపు రూ.1,650 కోట్లకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు.

    యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద 112 కిలోల బంగారం ఉంది. అందులో 65 కిలోలు విమాన గోపురానికి వినియోగించగా, 37 కిలోలు నిల్వలో ఉన్నాయి. అదనంగా 9.768 కిలోలు గోల్డ్ బాండ్ల రూపంలో బ్యాంకుల్లో ఉంచారు. వెండి నిల్వలు 1,742 కిలోలు ఉన్నట్లు సమాచారం.

    భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద 67.14 కిలోల బంగారం, 1,025.44 కిలోల వెండి ఉన్నాయి. ఇందులో 9 కిలోల బంగారాన్ని గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుబడిగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

    బాసర సరస్వతి దేవాలయం వద్ద 15 కిలోల బంగారం, 821 కిలోల వెండి ఉన్నాయి. ఇందులో 12.34 కిలోల బంగారాన్ని వివిధ బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్‌గా ఉంచినట్లు దేవాదాయశాఖ వెల్లడించింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Zayn Malik on fatherhood, skips spotlight
    తర్వాత ఆర్టికల్
    ENG vs WI, T20 WC: Phil Salt departs after providing powerful start to England in chase of 197

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి