శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    gunturu : గుంటూరులో పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ డా. షేక్ సలీం భాష

    1 వారం క్రితం

    గుంటూరు:
    గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష గుంటూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, అదే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల, హిందూ కాలేజ్ హై స్కూల్, యాదవ ఉన్నత పాఠశాల, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – నల్లపాడులను ఆయన సందర్శించారు.

    తనిఖీల సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన డీఈఓ, పదో తరగతి విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళిక అమలు తీరును సమీక్షించారు. అలాగే 9వ తరగతి విద్యార్థుల సిలబస్ పూర్తి స్థాయిపై ఉపాధ్యాయులతో చర్చించారు. రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు పెంచేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామస్తులు, తల్లిదండ్రుల సహకారంతో తమ క్యాచ్‌మెంట్ ఏరియాలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలకే వచ్చేలా ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.

    ఈ సందర్భంగా హిందూ కాలేజ్ హై స్కూల్‌లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డా. సలీం భాష పరిశీలించారు. కోడిగుడ్లు, చిక్కీల నాణ్యతతో పాటు వాటిపై ఉన్న గడువు తేదీలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించి, నూరు శాతం GFLN (Foundational Literacy & Numeracy) లక్ష్యాన్ని సాధించేందుకు ఉపాధ్యాయులు కట్టుదిట్టంగా పనిచేయాలని డీఈఓ డా. షేక్ సలీం భాష అన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India Energy Week: Union Minister Hardeep Singh Puri Calls For Sustained Investment
    తర్వాత ఆర్టికల్
    Why Parineeti Chopra doesn’t follow Saina Nehwal on Instagram

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి