శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Guduru :పేకాట శిబిరంపై గూడూరు పోలీసుల మెరుపు దాడి

    2 వారాలు క్రితం

    గూడూరు | 23 జనవరి 2026 :

    గుడూరు మండలంలోని రాయవరం పంచాయతీ శివారులో నిషేధిత పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గూడూరు సబ్‌ ఇన్స్పెక్టర్ దివ్య ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 8 మంది జూదరులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత జూదరులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

     

    ఈ సందర్భంగా గూడూరు ఎస్‌ఐ దివ్య ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, డీఎస్పీ రాజా ఆదేశాల మేరకు పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో గూడూరు మండలంలో పేకాట, కోడి పందాలు, గుండాట, చిత్తూలాట వంటి నిషేధిత క్రీడలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

     

    నిషేధిత కార్యకలాపాలపై సమాచారం ఉన్న ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి గానీ, లేదా 112 టోల్ ఫ్రీ నంబర్‌కు గానీ సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గూడూరు మండల పరిధిలో జూదం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    DJ reveals awkward moment at Beckham wedding; Nicola left in tears, Victoria took the stage
    తర్వాత ఆర్టికల్
    IND vs NZ: Ishan Kishan slams 21-ball half-centuryvs New Zealand

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి