శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Gudiwada Ysrcp Party : కూటమి దుర్మార్గాలను ప్రశ్నించినందుకే అంబటి రాంబాబుపై దాడి : వైఎస్ఆర్‌సీపీ నేతల ఆగ్రహం

    5 days ago

    గుడివాడ రాజేంద్రనగర్:

    కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రశ్నించినందుకే వైఎస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడి చేశారని వైఎస్ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడ రాజేంద్రనగర్‌లోని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో వారు ఈ ఆరోపణలు చేశారు.

     

    కర్రలు, రాడ్లతో అంబటి రాంబాబుపై దాడి చేయడాన్ని పోలీసులు కళ్లారా చూసినా చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. పైగా అక్రమ కేసులు నమోదు చేసి అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు.

     

    అధికారం ఉందని దాడులు చేయించడం సరికాదని, రాష్ట్రం చంద్రబాబుకు సొంత జాగీరు కాదని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. రోజులన్నీ ఒకేలా ఉండవని, మళ్లీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు జరిగిన అన్యాయాలకు వడ్డీతో సహా సమాధానం చెబుతామన్నారు.

     

    అంబటి రాంబాబును హత్య చేయాలనే ఉద్దేశంతో కర్రలు, రాడ్లతో దాడికి యత్నించారని, ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, ప్రజల్లో తిరుగుబాటు పెరుగుతున్న ప్రతిసారీ వైఎస్ఆర్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

     

    ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు పాలేటి చంటి, ఎం.వి. నారాయణరెడ్డి, అద్దేపల్లి పురుషోత్తం, లోయ రాజేష్, రేమల్లి నీలాకాంత్, ఎస్.కే. బాజీ, షేక్ సయ్యద్, సింహాద్రి రాంబాబు, గుదే రవి, కంభం ఇమ్మానుయేలు, రమీజా తదితరులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IND vs PAK: Major blow for India as Vihaan Malhotra departs
    తర్వాత ఆర్టికల్
    'A pattern has developed': Ex-India cricketer questions Samson's batting method

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి