శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Gudivada : కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి – వైసీపీ నేతల తీవ్ర విమర్శలు

    6 రోజులు క్రితం

    గుడివాడ, రాజేంద్రనగర్:
    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ దురుద్ధేశంతోనే దుష్ప్రచారం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. గుడివాడ రాజేంద్రనగర్‌లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను టీడీపీ కూటమి తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడ్డారు.

    తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సీఎం స్థాయిలో ఉండి ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం అత్యంత ఖండనీయమన్నారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

    సీబీఐ నివేదికతో దుష్ప్రచారం బట్టబయలు

    తిరుమల లడ్డూ నెయ్యిపై సీబీఐ నిర్వహించిన దర్యాప్తులో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా తేలిందని వైసీపీ నేతలు తెలిపారు. హర్యానాలోని ఐసీఏఆర్ – నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నెయ్యి నమూనాలను పరీక్షించి, పంది, చేప తదితర జంతువుల కొవ్వు ఏమాత్రం కలవలేదని నిర్ధారించాయని వెల్లడించారు.

    ఈ నివేదికలతో చంద్రబాబు చేసిన దుష్ప్రచార కుట్ర పూర్తిగా బెడిసికొట్టిందని విమర్శించారు. లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసి కోట్లాది హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువుల విశ్వాసాలపై దాడి కాదా? అంటూ చంద్రబాబును నిలదీశారు.

    పవన్ కల్యాణ్ మౌనంపై ప్రశ్నలు

    ఈ అంశంలో సనాతన ధర్మం గురించి తరచూ మాట్లాడే పవన్ కల్యాణ్ మౌనం వహించడం ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన పవన్, ఇప్పుడు ఎక్కడ కనిపించకుండా పోయారని విమర్శించారు. సీబీఐ నివేదిక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు చెంపపెట్టులా మారిందన్నారు.

    ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాలి

    శ్రీవారి లడ్డూ వంటి పవిత్ర అంశాన్ని రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబును ప్రజాక్షేత్రంలో బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

    పాల్గొన్న నాయకులు

    ఈ మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, నాయకులు పాలేటి చంటి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెరుగుమల కాళీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు జాన్ విక్టర్, అద్దేపల్లి పురుషోత్తం, కందుల నాగరాజు, జ్యోతుల మణికంఠ, దుడ్డు చిన్న, నీరుడు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Saurabh Shukla REACTS to Deepika's 8-hour shift demand
    తర్వాత ఆర్టికల్
    Lola Young returns to the stage after Sep 25 stage collapse

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి