శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Green Ammonia – Green Hydrogen : కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుంది: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    2 weeks ago

    కాకినాడ:
    ప్రభుత్వాలు మారినా పరిపాలనా విధానాలు స్థిరంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించి, కోర్టుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పిస్తూ, ప్రతి అడుగులో అండగా నిలుస్తుందని తెలిపారు.

    శనివారం కాకినాడ వాకలపూడిలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమ్మోనియా – గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు కూడా పాల్గొన్నారు.

    పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ అమ్మోనియా గేమ్ ఛేంజర్

    దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక మైలురాయి అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు.

    రూ.15,600 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు

    కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ.15,600 కోట్ల పెట్టుబడితో ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని వెల్లడించారు. పరోక్షంగా వేల మందికి దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు.

    ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో విధానపరమైన స్పష్టత

    ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో విధానపరమైన స్పష్టత ఇచ్చామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.

    యూరప్‌కు తొలి గ్రీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం

    ఏఎం గ్రీన్ సంస్థ జర్మనీకి చెందిన యూనిపర్ (Uniper) సంస్థతో గ్రీన్ అమ్మోనియా సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడం దేశ చరిత్రలోనే తొలి శుద్ధ ఇంధన ఎగుమతి ఒప్పందమని తెలిపారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారడం గర్వకారణమన్నారు.

    గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది

    గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి, పునఃసమీక్ష పేరిట విద్యుత్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. కియా వంటి అంతర్జాతీయ సంస్థలపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తూ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కాకినాడ జిల్లా ఉన్నతాధికారులు, ఏఎం గ్రీన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ICC steps in as England's Pakistan-origin players receive visas
    తర్వాత ఆర్టికల్
    FPI outflows: Foreign portfolio investors continue as net sellers; withdraw over Rs 22,500 crore

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి