శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Giddaluru : రాజుపాలెం రోడ్డుకు మహర్దశ రూ.4 కోట్లతో R&B డబ్లింగ్ రోడ్డు పనులకు భూమిపూజ

    2 వారాలు క్రితం

    గిద్దలూరు – నరవ – రాజుపాలెం రోడ్డుకు దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది. గిద్దలూరు మండలంలోని గిద్దలూరు – నరవ సరిహద్దు నుంచి రాజుపాలెం గ్రామం వరకు సింగిల్ రోడ్డు, గతుకుల మార్గంతో ప్రజలు మరియు ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

     

    ఈ సమస్యను ప్రజల తరఫున ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లిన గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి చొరవతో గిద్దలూరు – నరవ – రాజుపాలెం R&B రోడ్డును డబ్లింగ్ రోడ్డుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసింది.

     

    శుక్రవారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

     

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని అన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రోడ్డు అభివృద్ధితో ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు, ప్రయాణికులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IND vs NZ: Ishan Kishan departs for 76, receives a hug from Surya
    తర్వాత ఆర్టికల్
    PwC launches ‘AI Edge for Viksit Bharat’ to unlock $550 bn across five Indian sectors

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి