శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    FRTI Calendar : ఎఫ్‌ఆర్‌టీఐ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్, ఆర్‌టీఓలు

    1 వారం క్రితం

    పారదర్శక పాలనకు ఆర్‌టీఐ కీలకం: ఎఫ్‌ఆర్‌టీఐ నేతలు

    తిరుపతి (తొలి ఉదయం):
    ఎఫ్‌ఆర్‌టీఐ జాతీయ నేతల సూచనల మేరకు జాతీయ సంయుక్త కార్యదర్శి కుప్పాల అజయ్ ప్రసన్న కుమార్ నేతృత్వంలో ఎఫ్‌ఆర్‌టీఐ బృందం గురువారం తిరుపతిలో పర్యటించింది. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ జె.సి. మౌర్య, రీజినల్ ఆర్‌టీఓ కె. మురళీ కృష్ణతో పాటు సంబంధిత అధికారులను కలుసుకున్నారు.

    సమావేశంలో సమాచార హక్కు చట్టం (RTI), మానవ హక్కులు, లోకాయుక్త చట్టాలపై అవగాహన కల్పించే నూతన సంవత్సర ఎఫ్‌ఆర్‌టీఐ క్యాలెండర్‌ను అధికారులకు అందజేశారు. ప్రజలకు పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎఫ్‌ఆర్‌టీఐ నేతలు పేర్కొన్నారు. ఆర్‌టీఐ చట్టం ప్రకారం నిర్దేశిత గడువులో నిజాయితీగా సమాచారాన్ని అందించాలని కోరారు.   దీనికి స్పందించిన అధికారులు, ఆర్‌టీఐ చట్టం మేరకు ప్రజలకు సమయానికి సమాచారం అందిస్తామని, అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

    అలాగే అన్ని కార్యాలయాల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO), ఫస్ట్ అప్పీలేట్ ఆథారిటీ (FAA) వివరాలను డిస్‌ప్లే బోర్డుల్లో స్పష్టంగా ఉంచాలని, నిరక్షరాసులకూ ఆర్‌టీఐ దరఖాస్తు విధానంపై సహకారం అందించాలని ఎఫ్‌ఆర్‌టీఐ నేతలు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి ఎఫ్‌ఆర్‌టీఐ నేతలు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    What are ‘Trump Accounts’? How a $1,000 govt seed fund could reshape US child savings
    తర్వాత ఆర్టికల్
    Salman-Aishwarya was a 'violent love story', says producer: She was dignified

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి