శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Farmers Stage: ఓఆర్ఆర్ నోటిఫికేషన్ రద్దు చేయాలి తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

    1 వారం క్రితం

    కంచికచర్ల, జనవరి 28 (తొలి ఉదయం):

    తమ పంట పొలాలను ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) ఇవ్వబోమని, వెంటనే ఓఆర్ఆర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం కంచికచర్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బలవంతపు భూసేకరణను ఆపాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని నినాదాలు చేశారు.

     

    ధర్నా అనంతరం రైతులు మరియు రైతు సంఘ నాయకులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఓఆర్ఆర్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు మాట్లాడుతూ, తమ పొలాల్లో ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు పండుతున్నాయని, అలాంటి విలువైన భూములను రోడ్డు నిర్మాణానికి ఇవ్వలేమని స్పష్టం చేశారు.

     

    ప్రారంభంలో అధికారులు 70 మీటర్ల వెడల్పు మాత్రమే భూమి తీసుకుంటామని తెలిపారని, అయితే ఇప్పుడు అకస్మాత్తుగా 250 మీటర్ల వరకు భూసేకరణ చేస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు కనీసం 60 రోజుల గడువు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 21 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపించారు.

     

    ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, చట్టబద్ధంగా భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Budget 2026: From Poverty Reduction To Make In India, Key Highlights From President Murmu’s Address
    తర్వాత ఆర్టికల్
    'Border 2' box office collection day 6 (LIVE)

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి