శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Farmers Hardships నిరవధిక సమ్మెతో నిలిచిన సహకార సేవలు: రైతుల అవస్థలు

    1 hour ago

    నెల్లూరు - సైదాపురం,తొలి ఉదయం దినపత్రిక, పిబ్రవరి 24 : సైదాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి.ఏ.సి.ఎస్) కార్యాలయం ఈ నెల 16వ తేదీ నుండి తాళం వేసి ఉండటంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సిబ్బంది విధులను బహిష్కరించడంతో కార్యాలయం పూర్తిగా మూతపడింది. వ్యవసాయ పనులు ఉత్సాహంగా సాగుతున్న ఈ కీలక సమయంలో కార్యాలయం మూసివేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం పంటలకు ఎరువులు వేయాల్సిన అత్యవసర దశలో సొసైటీ అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయడం వల్ల అదనపు ఆర్థిక భారం పడుతోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందా లేదా సమ్మె ఇంకా కొనసాగుతుందా అన్న అనిశ్చితి రైతుల్లో మరింత కలవరం రేపుతోంది.

    కొత్త రుణాల మంజూరు, పాత రుణాల చెల్లింపులు వంటి కీలక ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని ఎక్కువ మంది రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో సొసైటీ మూతపడటం వారికి శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సిబ్బంది డిమాండ్లపై చర్చించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. సమ్మె కారణంగా మూతపడిన కార్యాలయాలను వెంటనే పునఃప్రారంభించి రైతులకు అవసరమైన సేవలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Why is stock market down today? Nifty50 goes below 25,500; BSE Sensex drops over 750 points - top reasons for crash
    తర్వాత ఆర్టికల్
    Why was Washington Sundar picked ahead of India vice-captain Axar Patel?

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి