శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    DSC Notification as Ugadi Gift : ఉగాది కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్.. 3,600 టీచర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు

    13 hours ago

    ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. మార్చి 19న తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం కానుండగా, అదే రోజున డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ విద్యాశాఖ ఖాళీల వివరాలను సేకరిస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదర్శ, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, సంక్షేమ శాఖల పాఠశాలల్లో సుమారు 1,200 పోస్టులు, పంచాయతీరాజ్, మున్సిపల్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో 1,700 పోస్టులు, ప్రత్యేక విద్యకు సంబంధించిన 700 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా ఆ ప్రక్రియను కొనసాగించేందుకు చర్యలు చేపడుతోంది.

     

    ఇక గత ఏడాది విడుదలైన డీఎస్సీ సిలబస్‌నే ఈసారి కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేవని, సిలబస్ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి టెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. అలాగే వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల చేసి, సుమారు 99 వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 WC: West Indies beat Italy by 42 runs in Kolkata
    తర్వాత ఆర్టికల్
    AIIMS दिल्ली में AI से इलाज शुरू, इन बीमारियों की होगी जल्दी पहचान

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి