శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Deputy Chief Minister Pawan kalyan Addresses Ministers and Secretaries’ Meeting : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధిపై రాజీ లేదు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    1 day ago

    అమరావతి, సోమవారం:
    కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన అన్నారు.

    సోమవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం తమకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని తెలిపారు.

    నాలుగు గోడల మధ్య తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థవంతంగా అమలయ్యేలా అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఉదాసీనతను వీడి పారదర్శకతతో విధులు నిర్వర్తించాలన్నారు.

    రూ. వేల కోట్ల అభివృద్ధి పనులు

    గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో పల్లె పండుగ మొదటి విడత కింద రూ.2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ.5,700 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధి కోసం ‘అడవి తల్లి బాట’ పథకం కింద రూ.1,005 కోట్లు వెచ్చించామని, సాస్కీ నిధుల ద్వారా రూ.2,123 కోట్లతో నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం రూ.11,328 కోట్లతో చేపట్టిన పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ కింద రూ.28 వేల కోట్ల పనులకు అనుమతులు లభించగా, ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులను ప్రారంభించామని పేర్కొన్నారు. అటవీ శాఖ పరిధిలో రూ.200 కోట్లతో నగరవనాల ఏర్పాటు జరుగుతోందన్నారు.

    నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి

    మొదలుపెట్టిన ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల అమలు, పనుల పురోగతిలో క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని, ఈ విషయంలో ఫిర్యాదులు కూడా వస్తున్నాయని తెలిపారు. ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని, ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్ధతతో, నిజాయతీగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ‘Lost a bit of power’: Ponting, Shastri on why Babar stands at a crossroads
    తర్వాత ఆర్టికల్
    Scotland crash Italy's T20 World Cup party with emphatic win

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి