శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    DCM Pawan Kalyan Says Strict Punishment is Inevitable for the Guilty : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం: దోషులకు కఠిన శిక్ష తప్పదన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    2 hours ago

    హిందూ ధర్మంపై ఎలాంటి దాడి జరిగినా భాష, కులం, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శాసనసభలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను సమాజం మొత్తం ఏకగ్రీవంగా ఖండించకపోతే ఈ తరహా పరిణామాలు కొనసాగుతాయని హెచ్చరించారు.

     

    నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని National Dairy Development Board (ఎన్.డి.డి.బి.) నివేదిక పేర్కొనగా, సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో అసలు నెయ్యే లేదని తేలిందని ఆయన తెలిపారు. పామాయిల్ మరియు ఇతర రసాయనాలతో తయారు చేసిన పదార్థాన్ని నెయ్యిగా సరఫరా చేశారని, ఇది శ్రీవారి ప్రసాదాన్ని ప్రణాళికాబద్ధంగా అపవిత్రం చేసినట్టేనని అన్నారు. పాల ప్రమేయం లేకుండా నెయ్యి తయారు చేయడం ఒక ఘోరమైన మోసం అని వ్యాఖ్యానించారు.

     

    గత టీటీడీ పాలక మండలే ఈ తప్పుకు బాధ్యత వహించాలన్నారు. టెండర్ నిబంధనలు సవరించి నచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని, అర్హతలు లేని సంస్థలు 2020–2023 మధ్య నెయ్యి సరఫరా చేశాయని సిట్ చార్జ్ షీట్ వెల్లడించిందని వివరించారు. 2019–2024 మధ్య కోట్లాది లడ్డూలు విక్రయించగా, వాటిలో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి వాడినట్లు రికార్డులు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని అన్నారు.

     

    భగవంతుడి సేవలో ఉండే వారు డబ్బుపై ఆశతో వ్యవహరించకూడదని, దేవాలయ వ్యవహారాల్లో పారదర్శకత అత్యవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మహా అపచారానికి పాల్పడిన వారిని కూటమి ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని తెలిపారు. హిందూ ధర్మాన్ని, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దోషులకు తగిన శిక్ష పడితేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    When Vijay's quick response to Rashmika's call made her blush
    తర్వాత ఆర్టికల్
    The Hundred: ‘Don’t discriminate against Pakistan players’

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి