శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Controversy Surrounds Behara Hospital : తప్పుడు చికిత్సతో ప్రాణం తీసిన బెహరా ఆసుపత్రి

    14 hours ago

     

    -- స్థానిక పత్రికలను పంపిణీ చేసే కె .వెంకట్రావు మృతి 

    --డాక్టర్లు , యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన 

    విశాఖపట్నం, ఫిబ్రవరి 16:స్థానిక పత్రికలను పంపిణీ చేసే కె .వెంకట్రావు(65) మరణించారు. ఆయన మృతికి గోపాలపట్నంలోని బెహరా ఆసుపత్రి డాక్టర్లు, యాజమాన్యమే కారణమంటూ వెంకటరావు బంధువులు ఆసుపత్రి ముందు సోమవారం ఆందోళనకు దిగారు. కాలుకు గాయమై ఆసుపత్రికి వస్తే ప్రాణం తీసారని మృతుని భార్య రోజా మేరీ, కుమారుడు శ్యాం ప్రసాద్ ఆరోపించారు. సంబంధిత డాక్టర్లు, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు  నమోదు చేసి అరెస్టు చేయాలని , ఆసుపత్రి పై సమగ్ర దర్యాప్తు చేయాలనీ నవయాన బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వేపకుంట ప్రాంతంలో నివాసం ఉంటున్న కె .వెంకట్రావు స్థానిక పత్రికలను పంపిణీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో బండి మీద నుండి జారీ పడిపోయారు. దాంతో కాలికి గాయమై గోపాల పట్నంలో గల బెహరా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఆర్థోపెడిక్ డాక్టర్ పరిశీలించి చిన్నపాటి ఆపరేషన్ అవసరమని చెప్పడంతో దానికి వెంకట్రావు బంధువులు అంగీకరించారు .సోమవారం మధ్యాహ్నం ఆపరేషన్ థియేటర్ కి తీసుకుని వెళ్లారని గంటలో డాక్టర్ బయటికి వచ్చి మత్తు మందు ఇచ్చామని దానికి ఆయన శరీరం సహకరించడం లేదని చెప్పారు మరో గంటలో అతను చనిపోయాడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు . కేవలం నిర్లక్ష్యంతో తప్పుడు చికిత్స చేయటం వల్లే వెంకట్రావు చనిపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ ముందు ఆయనకు అన్ని వైద్య పరీక్షలు చేశారని అంతా బాగుందని చెప్పారని తెలిపారు మత్తుమందు మోతాదుకు మించి ఇవ్వటం వల్లే చనిపోయి ఉంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. అసలు మత్తుమందు ఇచ్చిన డాక్టర్ అనస్థీషియా డాక్టరో కాదో తేలాలని కోరుతున్నారు. చనిపోయిన వెంటనే తమకు చెప్పకుండా రెండు గంటలపాటు రహస్యంగా ఉంచారని పేర్కొన్నారు. ఇంత అన్యాయానికి గురైన తాము హాస్పిటల్ యజమాని డాక్టర్ బెహరా రవితేజను సంప్రదిస్తే తమ పట్ల దారుణంగా మాట్లాడారని వాపోయారు. దిక్కున వాడి దగ్గర చెప్పుకోండి కేసు పెట్టుకోండి అంటూ  దురుసుగా మాట్లాడుతూ, బెదిరింపులకు దిగిరారని తెలిపారు.

     గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

    బెహరా ఆసుపత్రి యాజమాన్యం రాజకీయ పలుకుబడి కలగడంతో తొలుత పోలీసుల నుండి ఎలాంటి  స్పందన రాలేదు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదును  స్వీకరించలేదు. మా పరిధిలోకి రాదు.. పెందుర్తి పరిధి అంటూ పక్క దారి పట్టించారు పెందుర్తి పోలీసులను సంప్రదించగా తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకున్నారు . పోలీసులే యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ  తాత్సారం చేయటంతో స్థానిక పత్రికల ఎడిటర్లు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ , ఏసిపి లకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు 6 గంటల ఆలస్యంగా గోపాలపట్నం  పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. రాత్రి 11 గంటలకు మృతదేహాన్ని బెహరా ఆసుపత్రి నుండి కేజీహెచ్ మార్చూరికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నేడు పోస్టుమార్టం జరగనున్నది. పోలీసు కమిషనర్ డా.శంక బ్రత బాగ్చి సహకారంతో బాధితులకు ప్రాథమిక న్యాయం జరిగింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 World Cup: Giant-killers Zimbabwe eye historic Super 8 spot against Ireland
    తర్వాత ఆర్టికల్
    Priyanka Chopra reveals she faced nepotism in Bollywood

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి