శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Cm Revanth Reddy Delhi Tour : ఢిల్లీలో పౌర విమానయాన మంత్రితో భేటీ.. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కీలక చర్చలు

    11 hours ago

    న్యూఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన విమానాశ్రయాల నిర్మాణంపై వేగం పెంచే దిశగా ఈ రోజు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడుతో సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రతిపాదిత విమానాశ్రయాల పురోగతిపై సవివరంగా చర్చించారు. మామునూరు ప్రతిపాదిత విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయిందని, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలంటూ కోరారు. అలాగే కొత్తగూడెం ప్రతిపాదిత విమానాశ్రయానికి పాల్వంచలో స్థలం గుర్తించామని, అక్కడ OLS సర్వే మరియు ఫీజిబిలిటీ స్టడీ త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

    అంతర్గాం ప్రతిపాదిత విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం గుర్తించిన నేపథ్యంలో అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని, పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విమానాశ్రయాలు కీలకమని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరగడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని నాయకులు పేర్కొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Record! Italy batters become first-ever pair to achieve this feat
    తర్వాత ఆర్టికల్
    Aditya moves Bombay HC to quash rape FIR filed by actress

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి