శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    CM Chandrababu Focuses on Political Governance : పొలిటికల్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్.. ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరుపై సమగ్ర సమీక్ష

    14 hours ago

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పార్టీ పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ‘పొలిటికల్ గవర్నెన్స్’నే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఆరు రకాలుగా సేకరించిన క్షేత్ర స్థాయి నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల పరిస్థితులు, అధికారుల కార్యనిర్వహణపై సమగ్ర సమీక్ష చేపడుతున్నారు. మండల స్థాయి సమస్యలు, తాగు–సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ నిర్మాణాలు, రహదారులు, మున్సిపాలిటీల లెగసీ సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేస్తున్నారు.

     

    ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి నివేదికలు తెప్పిస్తున్నామని సీఎం వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ నాయకులు ప్రజల్లో చురుకుగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి సమగ్ర అభివృద్ధి చేపడుతున్నామని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అనర్హులకు పింఛన్లు అందుతున్న చోట్ల సరిదిద్దే చర్యలు తీసుకుంటామని, అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Spider-Man OTT India watch guide
    తర్వాత ఆర్టికల్
    Why Is The Stock Market Falling Today? Sensex, Nifty Slide Over 1%

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి