శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Citroen Dealer’s Bumper Offer in Coimbatore రూ.37 లక్షల కారు కొంటే మరో కారు ఫ్రీ.. కోయంబత్తూరులో సిట్రోయెన్ డీలర్ బంపర్ ఆఫర్

    14 hours ago

    తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న SGA సిట్రోయెన్ డీలర్ షిప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘బై వన్ గెట్ వన్’ తరహాలో కారు కొంటే మరో కారు ఉచితం అనే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. Citroen సంస్థకు చెందిన ప్రీమియం మోడల్ Citroen C5 Aircross కొనుగోలు చేసిన వారికి, అదే కంపెనీకి చెందిన Citroen C3 X కారును పూర్తిగా ఉచితంగా ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. రూ.37 లక్షలకుపైగా ఎక్స్-షోరూమ్ ధర ఉన్న C5 ఎయిర్‌క్రాస్‌తో పాటు రూ.8–10 లక్షల విలువైన C3 X ఉచితం ఇవ్వడం ఆటో రంగంలో సంచలనం రేపుతోంది.

     

    అమ్మకాలు మందగించిన నేపథ్యంలో పాత స్టాక్ క్లియర్ చేయడం, బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ క్రియేటివ్ ఆఫర్ తీసుకొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. శక్తివంతమైన డీజిల్ ఇంజిన్, ‘ఫ్లయింగ్ కార్పెట్ రైడ్’ సస్పెన్షన్, ఆధునిక భద్రతా ఫీచర్లతో C5 ఎయిర్‌క్రాస్ ప్రత్యేకతను చాటుకోగా, టర్బో పెట్రోల్ ఇంజిన్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో C3 X ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుందని, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి వివరాలను షోరూమ్ వద్ద తెలుసుకోవాలని డీలర్ సూచిస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Gold, silver price prediction today: Will gold hit Rs 1.63 lakh/10 grams & silver cross Rs 2.60 lakh/kg soon? Here's the outlook
    తర్వాత ఆర్టికల్
    "Shaadi nahi—khel ka samay hai!": Ishan Kishan's mom denies his wedding rumours

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి